విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి యోజన (పీఎంజీజేబీవై)కు అర్హులైన ప్రతి ఒక్కరు పాలసీని తీసుకోవాలని ఆయా బ్యాంకుల సిబ్బంది గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నామమాత్రపు రుసుంతో పేదలు బీమా పరిధిలోకి రావచ్చు. అమలులో ఉన్న రెండు బీమా పాలసీలకు అర్హులుగా ఉంటే రెండింటిని తీసుకోవచ్చు. ఈ బీమా వల్ల పేదలకు ఆపదలో ఆర్థిక భరోసా దక్కుతుంది. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో ఆయా బ్యాంకులు ఖాతాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. – విజయ్‌కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ నారాయణపేట
పోస్టాఫీసులో సంప్రదించాలి
జీవన్‌జ్యోతి, సురక్షబీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకాలతో తక్కువ వార్షిక ప్రీమియంతో అత్యధిక ప్రయోజనాలున్నాయి. ఆసక్తి గలవారు సమీప పోస్టాఫీసులో సంప్రదించాలి. పోస్టుమన్‌కు సమాచారం అందించినా ఈ పాలసీలను అందిస్తారు.
– రవికుమార్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్
●
Comments
Please login to add a commentAdd a comment