స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం క్లాక్‌టవర్ సెంటర్‌లో శనివారం సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను ప్రముఖ సినీనటి, డాకు మహారాజ్ ఫేమ్ ఊర్వశి రౌతేలా ప్రారంభించారు. షోరూం అంతా తిరిగిన ఆమె పలు వస్త్రాలను పరిశీలించారు. హీరోయిన్‌ను చూసేందుకు షోరూం వద్ద జనం కిక్కిరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు అభివాదం చేసి సినీ పాటలకు డాన్స్ చేస్తూ హోరెత్తించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ సంస్థ డైరెక్టర్లు సురేశ్ సీర్ణ, అభినయ్, రాకేష్, కేశవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment