అన్ని రంగాల్లో మహిళల ముందంజ
నారాయణపేట: ఏ ఇంట్లో అయితే మహిళ బాగా చదివితే ఆ కుటుంబమంతా బాగుపడుతుందని, ప్రస్తుతం మహిళలు అటు ఇంట్లో పని చేస్తూ తమ విధి నిర్వహణలో రాణిస్తున్నారన్నారని, ఇక మహిళా పోలీసులు తమ విధి నిర్వహణలో గొప్పగా రాణిస్తూ ఆదర్శంగా నిలవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న మహిళా పోలీసులు, డీపీఓ స్టాప్, ఆఫీస్ స్టాఫ్‌తో శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళ పోలీసులచే కేక్ కట్ చేయించి ఎస్పీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలకు ఓర్పు, సహనం, పట్టుదల ఎక్కువ అని ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీపడి ఉద్యోగ అవకాశాల్లో విధుల్లో వారితో సమానంగా మహిళలు పనిచేయడం గొప్ప విషయమన్నారు. శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీస్ శాఖలో పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. మహిళా పోలీసులకు విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాని పోలీస్ స్టేషన్లో గాని పని చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ ఉందని, అందులో కంప్లైంట్ చేయవచ్చని మహిళా పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య,ఆర్‌ఐ నరసింహ, మహిళ ఎస్సైలు స్వాతి, సునిత, రేవతి, గాయత్రి, మహిళ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment