
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం
చిరుతల సంచారం కొనసాగుతుందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తున్నా వాటిని పట్టుకోవడం కోసం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతేడాది చిరుత సంచరిస్తుందని గుర్తించిన అధికారులు మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ గ్రామ శివారులో బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల కదలికల కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 10 రోజులు ఉంచి చిరుతలు చిక్కకపోవడంతో వాటిని తొలగించారు. ఆ తర్వాత తరచూ లేగదూడుల, మేకలు మృతి చెందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ మోమినాపూర్‌లో 15 రోజుల్లో చిరుత, లేగదూడలు మృతి చెందడంతో ఒక బోనును ఏర్పాటు చేశారు. పశువుల స్థానంలో మనుషుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment