మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
నారాయణపేట టౌన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈమేరకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేద్రంలో మహిళలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశంలో ఇంటా బయట మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న గృహహింస, వరకట్న వేధింపుల చట్టాలను తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సీ్త్రలు సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. లింగభేదం లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి,సరళ,లక్ష్మి,సునిత,లక్ష్మి,అరుణ,అనిత.రాధిక.చంద్రకళ పలువురు పాల్గొన్నారు.
చింతపండు క్వింటాల్ రూ.10,189
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం చింతపండు 52 క్వింటాళ్లు విక్రయానికి రాగా.. క్వింటా గరిష్టంగా రూ.10,186, కనిష్టంగా రూ.6 వేలు పలికింది. అలాగే, శనగలు 19 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,950, కనిష్టం రూ.5,811, ఎర్రకందులు 136 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,461, కనిష్టం 6,469, జొన్నలు 84 క్వింటాళ్లు రాగా గరిష్టం రూ.4,400, కనిష్టం రూ.3,629 ధర పలికింది. అదేవిధంగా, వేరుశనగ 41 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.5,420, కనిష్టం రూ.3,910, తెల్లకందులు 58 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,700, కనిష్టం రూ.6.870 ధర పలికింది.
సీఎంను కలిసిన పీయూ వీసీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్‌లో వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్‌బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వేస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
Comments
Please login to add a commentAdd a comment