రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతే డాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలు ముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పాలమూరు నుంచి 14 బస్సులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: హైదరాబాద్‌లో శనివారం జరిగే మహిళా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ఎస్‌హెచ్‌జీలు 800 మంది పాల్గొనాలని మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌కి చెందిన 700 మంది మహి ళల కోసం 14 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాల మైదానంలో అందు బాటులో ఉంచినట్లు ఆమె పేర్కాన్నారు. శనివా రం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఆయా ప్రాంతాలకు తరలి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయాలి
● ఎస్‌బీఐ ఉద్యోగుల నిరసన
స్టేషన్ మహబూబ్‌నగర్: బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎస్‌బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్‌కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని ఎస్‌బీఐ ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో బ్రాంచీల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment