రాజీమార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే రాజమార్గం

Published Sun, Mar 9 2025 12:35 AM | Last Updated on Sun, Mar 9 2025 12:34 AM

రాజీమార్గమే రాజమార్గం

రాజీమార్గమే రాజమార్గం

నారాయణపేట: రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో ఎలాంటి కేసులైనా పరిష్కరించుకోవచ్చని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌న్స్‌ జడ్జి కం చైర్మన్‌ డీఎల్‌ఎస్‌ఎ మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి కం సీనియర్‌ సివిల్‌ జడ్జి వింద్యనాయక్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మహమ్మద్‌ ఉమర్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జకియా సుల్తానా, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేష్‌ కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలప్ప, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కె లక్ష్మీపతి గౌడ్‌ , నాగేశ్వరి, ఇతర న్యాయవాదులు కలిసి లోక్‌ అదాలత్‌కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం అన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని కోరారు.

9,825 కేసులు.. రూ.24 లక్షల ఆదాయం

ఇదిలాఉండగా, శనివారం నాటి లోక్‌ అదాలత్‌ లో జిల్లా కోర్టు పరిధిలో 9825 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్‌ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి అభినందించారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికి గాను రూ 24,08,020 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందన్నారు.ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి , డి ఎల్‌ ఎస్‌ ఏ కార్యదర్శి వీంధ్య నాయక్‌ మాట్లాడుతూ.. ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని సూచించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి మహమ్మద్‌ ఉమర్‌ మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమని, చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల వారికి ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందన్నారు. సివిల్‌ తదితర కేసులలో ఒకరికొకరు రాజీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతాయని ఇద్దరూ గెలుస్తారని తెలిపారు తెలిపారు. అనంతరం రాజీ అయినవారికి మొక్క, అవార్డును న్యాయమూర్తులు అందజేశారు. పిపి బాలప్ప మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్‌ అదాలత్‌ జరుగుతుందన్నారు. ఆర్థిక స్తోమత లేని వారి కేసులను ఉచితంగా వాదించడానికి న్యాయవాదులను నియమిస్తుందని డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మిపతిగౌడ్‌ తెలిపారు.

జిల్లా జడ్జి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ

జాతీయ లోక్‌అదాలత్‌లో

9,825 కేసుల పరిష్కారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement