మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలి
పాలమూరు: మహిళలు ఎందులో తక్కువ కాదని, మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే మొదలుపెట్టాలన్నారు. సీ్త్ర శక్తిని దేనితో పోల్చలేమని, వారి పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, శారదా దేవి, శ్రీదేవి, రాజేశ్వరి, డి.ఇందిర, రాధిక, మమతారెడ్డి, రవిశంకర్, భావన, నిర్మల, మాధవి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment