
మిగిలింది 43 రోజులే..
జిల్లాలో ఇప్పటి వరకు 76 శాతం పన్ను వసూళ్లు
మద్దూర్‌లో అత్యల్పం.. ధన్వాడ అత్యధికం
జిల్లాలోని 11 మండలాల్లో మద్దూర్ మండలంలో అత్యల్పంగా పన్ను వసూలైంది. ఈ మండలంలో మొత్తం 49 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రూ.45,76,444 పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.23,30,287 (51శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇక మాగనూర్ మండలంలో 64 శాతం, కోస్గి మండలంలో 66 శాతం, అత్యధికంగా ధన్వాడ మండలంలో 98 శాతం వసూలయ్యాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, సంతలు, లైసెన్సులు, బంజరుదొడ్డి తదితర వాటిపై ఏటా ప్రణాళిక ప్రకారం వంద శాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది. వచ్చిన నగదును కార్యాలయంలో జమ చేసి గ్రామ పంచాయతీ అవసరాలు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, గ్రామ సభల ఏర్పాటుకు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం మరో 43 రోజుల్లో ముగింపు దశకు చేరుకుంటున్నా పన్ను వసూళ్లపై శ్రద్ద పెట్టడం లేదని అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. దీనికితోడు సమగ్ర కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఇలా వస్తుండడంలు పన్నుల వసూళ్లు నెమ్మదించినట్లు పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు.
నారాయణపేట: జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకునేందుకు మరో 43 రోజులే గడువు మిగిలిఉంది. ఇప్పటి వరకు రూ.2.77 కోట్లు (76 శాతం) వసూలయ్యాయి. ఈ ఏడాది రూ.3.63 కోట్ల ఇంటి వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకొంది. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల అర్హులను ఎంపిక చేసేందుకు వరుస సర్వేలు నిర్వహించగా.. ఈ పనుల్లోనే పంచాయతీ కార్యదర్శులు నిమగ్నమయ్యారు. ఇంటి పన్ను, ఇతర పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి సారించలేదు. దీంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరిన్ని అడ్డంకులు ఏర్పడతాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ప్రత్యేక దృష్టి సారిస్తేనే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. వచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీకి సంబందించిన పన్నులు వసూలు చేస్తూ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూలు 280 జీపీల్లో 1,31,790 ఆస్తులకుగాను రూ.3,63,59,373 వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 2.77 కోట్లు వసూలు చేశారు. మిగిలిన ఈ కొద్ది రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసం ఎంతైనా ఉంది.
●
లక్ష్యం చేరుకుంటాం
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యం మేరకు వంద శాతం పన్ను వసూ లు చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటి వరకు 76 శాతం పన్ను వసూలు చేశాం. ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– కృష్ణ, డీపీఓ, నారాయణపేట
జిల్లా వివరాలిలా..
వసూలు కావాల్సింది రూ.3.63 కోట్లు
గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం చేరేలా కార్యాచరణ
వరుస సర్వేలతో కార్యదర్శులకు తప్పని తిప్పలు
స్థానిక సంస్థల ఎన్నికలోస్తే వసూళ్లు అంతంతే

మిగిలింది 43 రోజులే..
Comments
Please login to add a commentAdd a comment