
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని అఖిలభారత చేనేత కార్మిక సంఘం కో కన్వీనర్ కెంచె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నారాయణపేట, ఉట్కూర్ మండలాల్లోని జాజాపూర్, చిన్నపోర్ల గ్రామాల్లో సోమవారం పర్యటించి నేతకార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న సహకార భారతి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నారాయణపేటలో నిర్వహిస్తున్న చేనేత కార్మికుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి సహకార భారతి చేనేత విభాగం అఖిల భారత అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా, సహకార భారతి రాష్ట్ర కార్యదర్శి నాగిళ్ల కుమారస్వామి హాజరవుతారని, ఇక్కడి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంతో పోరాటం చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. పెద్ద ఎత్తున నేతకార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయభాను, జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి, కిష్టప్ప, రాధాకృష్ణ, రఘురాములు, రాములు, బలప్ప, వెంకటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment