రైతుల పక్షాన.. బీఆర్‌ఎస్‌ పోరాటం | - | Sakshi
Sakshi News home page

రైతుల పక్షాన.. బీఆర్‌ఎస్‌ పోరాటం

Published Tue, Feb 11 2025 2:34 AM | Last Updated on Tue, Feb 11 2025 2:34 AM

రైతుల

రైతుల పక్షాన.. బీఆర్‌ఎస్‌ పోరాటం

కొద్దికాలంలోనే

తీవ్ర వ్యతిరేకత

రాష్ట్రంలో కొద్దికాలంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని కేటీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల్లో 420 హామీలిచ్చి ఏ ఒక్కటీ కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద తండాలో కూడా వంద గిరిజన కుటుంబాలకు చెందిన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కేటీఆర్‌ దృష్టికి తీసుకురాగా వీరికి అండగా కూడా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. రోటిబండతండా రైతులతో సభలో కేటీఆర్‌ మాట్లాడించారు.

కోస్గి శివాజీ చౌరస్తాలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేటీఆర్‌

కోస్గి: ‘రాష్ట్రంలోని రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. కేసీఆర్‌ ప్రభుత్వంలో రైతులను కళ్లలో పెట్టుకొని చూసినం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో రైతుబంధుకు రాం రాం.. పూర్తిస్థాయి రుణమాఫీ జరగలేదు. కానీ, మిత్రుడు అదానీ, అల్లుడు, ఎనుముల కుటుంబ కోసం రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కోస్గిలో చేపట్టిన ‘రైతు నిరసన దీక్ష’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై రైతులనుద్దేశించి ప్రసంగించారు.

పచ్చని పంటలు కనిపిస్తున్నాయి

రాష్ట్రంలో దుర్యోధనుడి పాలన కొనసాగుతుంది. కొడంగల్‌ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతంలోని భూముల్లో తొండలు గుడ్లు పెడుతాయి తప్ప వ్యవసాయానికి పనికి రాదని చెప్పి.. ఇప్పుడు అవే భూములను లాక్కునే ప్రయత్నం చేశాడని, ఇక్కడికి వచ్చి చూస్తే తుంకిమెట్ల నుంచి రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరిపంటలు కనిపిస్తున్నాయని చెప్పారు. 60, 70 ఏళ్ల నుంచి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే లగచర్ల, రోటిబండతండా రైతుల పోరాట స్ఫూర్తి ఆదర్శ ప్రాయమన్నారు. తండాల్లో 70 మంది మీద మొదట కేసులు పెట్టారు.. తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, మద్దతుదారుల పేర్లు తొలగించి 40 మంది బీఆర్‌ఎస్‌ మద్దతుదారులను మాత్రమే జైల్లో పెట్టారు. వీరితోపాటు అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని 40 రోజుల పాటు జైల్లో ఉంచారని గుర్తుచేశారు. జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డిని మేం కలవడానికి వెళ్తే.. నేను బాగానే ఉన్నాను. రైతుల కోసం నెల కాదు ఏడాదైనా జైల్లో ఉంటాను. అక్రమంగా కేసులు బనాయించి చర్లపల్లి జైల్లో పెట్టిన రైతులను విడిపించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారని గుర్తుచేశారు. మా మాజీ ఎమ్మెల్యే రైతుల పక్షాన జైలుకు వెళితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని దుయ్యబట్టారు.

కేటీఆర్‌ పర్యటన సాగిందిలా..

మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన కొడంగల్‌ నియోజకవర్గంలోని మెట్లతండాకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాన్వాయ్‌ ప్రవేశించింది.

2: 20 గంటలకు నియోజకవర్గంలోని తుంకిమెట్ల గ్రామంలోని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌ జెండాను కేటీఆర్‌ ఆవిష్కరించారు.

2:27 గంటలకు ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వడ్ల మోనయ్యచారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

2:40 గంటలకు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం వద్ద కాసేపు వాహనాలు నిలిపారు. అక్కడ సాగు చేసిన వరి పొలాలను కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు, తదితరులు పరిశీలించారు.

2:45 గంటలకు హకీంపేటకు చేరుకొని భూబాధిత మహిళ జ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె బిడ్డకు నామకరణం చేశారు.

3: 15 గంటలకు కోస్గిలోని రామాలయం చౌరస్తాకు చేరుకున్నారు.

4:02 గంటలకు కోస్గిలోని రైతు నిరసన దీక్ష సభకు చేరుకున్నారు.

4:05 గంటలకు సభాధ్యక్షుడు మాజీ ఎమెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రసంగం.

4: 24 గంటలకు కేటీఆర్‌ ప్రసంగం.. 31 నిమిషాలపాటు సాగింది.

4:59 గంటలకు కేటీఆర్‌ హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు.

పచ్చని పొలాలను అదానీ, అల్లుడికి దానం చేస్తే ఊరుకోం

లగచర్ల రైతుల పోరాట స్ఫూర్తి ఢిల్లీని కదిలించింది

రాష్ట్రంలో దుర్యోధన పాలన సాగుతోంది

కోస్గి ‘రైతు నిరసన దీక్ష’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఎత్తిపోత పథకం కాంట్రాక్టు మంత్రి కోసమే

కొడంగల్‌– పేట ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు కాంగ్రెస్‌లోని ఓ మంత్రి కోసం రూ.4,500 కోట్లు పెట్టాడని కేటీఆర్‌ దుయ్యబట్టారు. అంతుకు ముందే పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్‌ ఒక్క నియోజకవర్గానికే 1.50 లక్షల ఎకరాలకు సాగునీటి అందించడానికి 90 శాతం పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు ఆ పనులు ఆపి జూరాల నుంచి మళ్లీ నీళ్లు తీసుకొస్తానని కొత్త నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుల పక్షాన.. బీఆర్‌ఎస్‌ పోరాటం 1
1/1

రైతుల పక్షాన.. బీఆర్‌ఎస్‌ పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement