
రైతు కష్టం దళారులపాలు
కూరగాయల రైతును నిండా ముంచుతున్న వ్యాపారులు
మరికల్: రాత్రనకా.. పగలనకా ఎంతో కష్టపడి కూరగాయలను సాగు చేస్తున్న రైతును అటు దళారులు, వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నేరుగా పొలాల వద్దకు వెళ్లడం.. తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేయడం.. బయటి మార్కెట్‌లో అంతకు రెండు మూడింతలు ఎక్కువకు విక్రయిస్తూ రైతు కష్టాన్ని వీరు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతుకు కష్టం తప్ప లాభం దక్కడం లేదు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు విత్తనాలు, నారు, కలుపు, ఎరువులు, కూలీలు, రవాణా తదితరాలన్నీ కలిపి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి ఖర్చు అవుతున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన కూరగాయల్ని విక్రయిస్తున్న దుకాణదారులు, మద్యవర్తులు ఏకంగా అధిక లాభాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి టమాటాను కిలో రూ.5 నుంచి 10 కొంటున్నారు. వీటినే మార్కెట్‌లో కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. మొత్తంగా లాభం లేకపోవడంతో రైతులు నానాటికి కూరగాయల సాగును తగ్గించి వరి, ఇతర పంటలవైపు మొగ్గుచూపుతున్నారు.
అన్నదాత నుంచి తక్కువధరకు కొనుగోలు
రెండు, మూడింతలు అధిక ధరకు బయటి మార్కెట్‌లో విక్రయాలు
క్రమంగా తగ్గుతున్న కూరగాయలు సాగు
ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల మొగ్గు
జిల్లాలో కూరగాయల దిగుబడి
16 టన్నులు.. అవసరం 135 టన్నులు
కర్ణాటక.. ఆంధ్ర నుంచి
దిగుమతులు
కూరగాయల సాగును జిల్లాలో రైతులు తగ్గిస్తూ వస్తుండడంతో విధిలేని పరిస్థితిలో బయటి నుంచి దిగుబతి చేసుకోవాల్సి వస్తోంది. జిల్లాకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్, యాద్గీర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాల నుంచి చాలావరకు కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో రవాణా ఖర్చులు కలిపి వ్యాపారులు కూరగాయల ధరలను నిర్ణయి స్తున్నారు. జిల్లాలో గత 15 ఏళ్ల నుంచి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా రైతులు కూరగాయల సాగును తగ్గించి పత్తి, వరిపైనే మక్కు వ చూపుతున్నారు. ఉధ్వాన శాఖ అధికారులు మార్కెట్‌లో కూరగాయలకు ఉన్న డి మాండ్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అ వగా హన కల్పించడంతోపాటు.. బయటి మార్కెట్‌లో వచ్చే లాభాలు రైతుకు అందేలా చూ స్తేనే జిల్లాలో సాగు పెరిగే అవకాశం ఉంది.

రైతు కష్టం దళారులపాలు
Comments
Please login to add a commentAdd a comment