
కేసుల పరిష్కారానికి రాజీమార్గం ఉత్తమం
నారాయణపేట: చిన్నచిన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని.. వచ్చేనెల 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఆవరణలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. రాజీ అయ్యే కేసులను జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. యాక్సిడెంట్, పరస్పర దాడులు, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులతో పాటు చిన్నచిన్న చోరీల కేసులు, కరోనా సమయంలోని కేసులు, డ్రంకెన్ డ్రైవ్ తదితర కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లాలోని నారాయణపేట పట్టణ, రూరల్, మాగనూరు, మద్దూరు, దామరగిద్ద, ఉట్కూర్, కోస్గి, ధన్వాడ, మక్తల్, కృష్ణా, నర్వ, మరికల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈపెట్టి, డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో ఉన్న పెండింగ్ కేసులను క్లియర్ చేయాలన్నారు. మొత్తం 6,540 కేసులను క్లియర్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్‌జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ జడ్జి సయ్యద్ జాకియా సుల్తానా, డీఎస్పీ లింగయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment