
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో మరికల్, ధన్వాడ, ఊట్కూర్, దామారగిద్ద, కోస్గి మండల్లాలో మాత్రమే అరకొరగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి జిల్లా అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇక్కడ కేవలం ఒక గుంట, లేక అర ఎకరా లోపు మాత్రమే కూరగాయలు సాగు చేయడం వల్ల అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక రైతు రెండు నుంచి మూడు ఎకరాలకు పైగా కూరగాయలను సాగు చేసి ఇతర పంటలకు మార్కెటింగ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి లేకనే గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కూరగాయలను విక్రయిస్తున్నారు. నారాయణపేట, మక్తల్, మద్దూరు, మరికల్ మండల్లాలో జరిగే వారాంతపు సంతలకు ఎక్కువగా కర్ణాటకలోని రాయచూర్ నుంచి దిగుమతి అవుతున్నాయి. మద్దూరు, కోస్గి మండల్లాలో జరిగే సంతలకు సరిహద్దు ప్రాంతాలతో పాటు కర్నూల్ జిల్లా నుంచి వస్తున్నాయి. 70 శాతం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే జిల్లా అవసరాలను తీర్చడం గమనార్హం. క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్, క్యాలిప్లవర్, బీట్‌రూట్, బీర్నీస్, ముళ్లంగి సాగు మాత్రం జిల్లాలో నామమాత్రంగా ఉంది. ఇక్కడ కేవలం టమాటా, బీర, బెండకాయ, దొండకాయ, చిక్కు డు.. ఆకు కూరగాయలు మాత్రం నామమాత్రంగా పండిస్తున్నారు. ఇవి ఏవి కొనుగోలు చేసినా కిలో రూ.60 పైనే ఉండడంతో సామాన్య, పేద ప్రజలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment