
తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం
కోస్గి రూరల్: వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధిపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డితో కలిసి మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌ను మరో సిరిసిల్లగా మారుస్తానని హామీ ఇచ్చి ఎడారిగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తుంటే.. ఓర్వలేక అడ్డుకుంటున్నారని ధ్వజమె త్తారు. పట్టణంలో రోడ్డు వెడల్పు బాధితుల కోసం రూ. 7కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలో రైతుభరోసా డబ్బు లు జమ అవుతున్నాయని.. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, అన్న కి ష్టప్ప, విక్రంరెడ్డి, హరి, రాజేష్, భానునాయక్, న ర్సింహ, రాంబాబు, బాల్‌రాజ్, కృష్ణమూర్తి, సోమ శేఖర్, సుధాకర్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment