
రైతులకు నష్టమే మిగులుతోంది..
కష్టపడి పండించిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు, వ్యాపారులు కిలో టమాట రూ.5కు అడుగుతారు. తమతో ప్రతి కూరగాయల్ని తక్కువ ధరలకే కొనుగోలు చేసి వారు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రేయనకా.. పగలనకా కష్టపడి కూరగాయలు పండించిన రైతుకు నష్టాలు వస్తే.. వ్యాపారులకు మాత్రం లాభాలు గడిస్తున్నారు. – మణెమ్మ, మందిపల్లితండా
వ్యాపారులే
లాభపడుతున్నారు..
వారాంతపు సంతలో కూ రగాయల ధరలు రైతులు నేరుగా విక్రయిస్తే తక్కువ ధర ఉంటుంది. అదే వ్యాపారులతో అధిక ధరలు ఉంటున్నాయి. చాలామటుకు దళారులు.. పొలాల వద్దకు, లేదా రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన వెంటనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వినియోగదారులకు అధిక ధరకు విక్రయించి త్రీవంగా ముంచుతున్నారు. పంట పండించిన రైతులు నష్టపోతుండగా.. వ్యాపారులు అధిక లాభం పొందుతున్నారు. మొత్తంగా రైతు, వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడు. – లక్ష్మమ్మ, పెద్దచింతకుంట

రైతులకు నష్టమే మిగులుతోంది..
Comments
Please login to add a commentAdd a comment