
బోనస్‌పైనే ఆశలు..!
నారాయణపేట: ధాన్యం బోనస్ డబ్బుల కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు పూర్తయిన నేటికీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వరి ధాన్యం క్వింటాపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో చాలామటుకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 102 వరి ధాన్యం ప్రభుత్వ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 89,928 ధాన్యం (ఎంటీఎస్) కొనుగోలు చేశారు.
రూ.10.46 కోట్ల కోసం ఎదురుచూపులు
రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320తో పాటు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 12,597 మంది రైతులతో దొడ్డు రకం 18,175 మెట్రిక్ టన్నులు, సన్నరకాలు 71,750 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి క్వింటాల్‌కు రూ. 2,320 చొప్పున రైతులందరికి చెల్లించాల్సిన డబ్బులు రూ.208.63 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యా యి. సన్నరకాల ధాన్యం కొనుగోళ్లలో 7,17,653 క్వింటాళ్లకు గాను రూ.35.88 కోట్ల చెల్లింపులకు గాను రూ.25.41 కోట్లు చెల్లించారు. మిగతా రూ.10.46 కోట్ల మేర రైతులకు బోనాస్ చెల్లించాల్సి ఉండగా గత రెండు నెలలుగా రైతులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సన్న రకాలు విక్రయించిన రైతుల వివరాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంలో ఆన్‌లైన్ న మోదుచేసి పౌరసరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్‌కు పంపించడంతో డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. సన్న రకాల బోనస్ చెల్లించేందుకు డీఎస్‌ఓ లాగిన్‌కు వెళతాయి. అక్కడి నుంచి రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది.
ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నాఅందని డబ్బులు
రైతులకు తప్పని ఎదురుచూపులు
జిల్లాలో పెండింగ్ రూ.10.46 కోట్లు

బోనస్‌పైనే ఆశలు..!
Comments
Please login to add a commentAdd a comment