
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని సోమశిల గ్రామంలో ఏఐసీసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ట్రైకా చైర్మన్ బెల్లయ్యనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు జ్యోత్రి ప్రజల్వన చేసి శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, వాటి పరిరక్షణ తదితర అంశాలపై శిక్షణ శిబిరంలో వక్తలు వివరిస్తారని చెప్పారు. శిక్షణ తరగతులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు రోజులపాటు కొనసాగే శిక్షణ తరగతుల్లో పలువురు ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు గిరిజనులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మంత్రి జూపల్లిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లింగయ్యనాయక్, హన్మంతునాయక్, శంకర్‌నాయక్, గోపి, బస్తీరాం, బాలు, శ్రీరామ్‌నాయక్ పాల్గొన్నారు.
పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి
కృష్ణా తీర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సోమశిల నదీతీర ప్రాంతాలు పరిశీలించారు. లాంచీలో వెళ్లి మల్లేశ్వరం ఐల్యాండ్, అమరగిరి ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సోమశిలలో భక్తుల విడిది కోసం నూతనంగా షెడ్లు, డార్మెటరీ గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు ఇతరవి తీర్చిదిద్దుతామన్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు వెళ్లే లాంచీని రోజువారీగా తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment