మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 18, 19 తేదీల్లో 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నేడు (గురువారం) జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 లోపు బాలబాలికలకు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తామని, ఆసక్తి గల క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9492177535, 9440656162 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment