చేనేత రంగాన్ని సమష్టిగా కాపాడుకుందాం
నారాయణపేట రూరల్: దేశ స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించి ప్రజల మానం కాపాడుతున్న చేనేత పరిశ్రమను అందరం కలిసి సమష్టిగా కాపాడుకుందామని సహకార భారతి జాతీయ అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా పిలుపునిచ్చారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో అఖిల భారత సహకార భారతి చేనేత విభాగం కో కన్వీనర్ కే.శ్రీనివాస్ అధ్యక్షతన చేనేత కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, కానీ గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని అన్నారు. వారి సంక్షేమం కోసం సహకార భారతి తన వంతు కృషి చేస్తున్నదని అన్నారు. అయినా రాష్ట్రంలో కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ లో ప్రభుత్వం మూడు నుంచి రెండేళ్లు, ముగ్గురు సభ్యుల నుంచి ఇద్దరిని చేయడం, రూ.2200 నుంచి రూ.1800 తగ్గించడం చూస్తుంటే ప్రభుత్వ విధానం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే గతంలో మాదిరి ఈ పథకంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ, ప్రతినిధులు శ్రీనివాస్, కుమార స్వామి, బాల్‌రెడ్డి, ఉదయబాను, యాదగిరి, రాధాకృష్ణ, వెంకట్రాములు, వివిధ చేనేత సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment