నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు శేఖర్, జిల్లా ఇన్‌చార్జ్ మోడం ఆంజనేయులు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి వేముల సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment