వివాహానికి చట్టబద్ధంగా కనీస వయసు తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. చట్టపరంగా యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం ఆకర్షణకు లోనై ప్రస్తుతం చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వయసు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే యువతుల కనీస వయసు 18 ఏళ్లు నిండని పక్షంలో వారిని మైనర్లుగా భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మైనర్లను వివాహం చేసుకోవడం, పెద్దల అనుమతి లేకుండా తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఇలాంటి కేసుల్లో యువతి సమ్మతి లేకుంటే యువకుడిపై అత్యాచారం, అపహరణ కేసులు కూడా నమోదు చేస్తారు. ఒకవేళ యువతి సమ్మతి ఉంటే కనీస వయసు పూర్తయ్యే వరకు ఆమె ఇష్టానుసారం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment