
బీసీలు చైతన్యం కావాలి
నారాయణపేట రూరల్ : సమాజంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు చైతన్యం కావాలని బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.రామాంజనేయులుగౌడ్ అన్నారు. సమాజ్ వాదీ ఉద్యమ నేత అక్కల బాబుగౌడ్ రచించిన ‘విముక్తి రాజనీతి’ కవిత సంపుటి పుస్తకాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయ వ్యవస్థపై 77 ఏళ్ల స్వతంత్ర పాలన, 76 సంవత్సరాల రాజ్యాంగ అమలులో రాజ్యాంగ బద్ధంగా దేశ ప్రజలందరికీ, సామాజిక, ఆర్థిక రాజకీయ సమానత్వం అందలేదన్నారు. అణచివేయబడిన వర్గాల ప్రజల రాజకీయ ఓటు చైతన్యం గురించి, సబ్బండ జాతులు రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా తన కవితల్లో బాబుగౌడ్ స్పష్టంగా సరలమైన భాషలో వివరించారని తెలిపారు. లోతైన విషయ అవగాహనతో నేటి రాజకీయ పరిస్థితులను, పాలనా విధానాలను అద్భుతంగా వివరించడాన్ని యువత తెలుసుకోవాలన్నారు. బీసీ ప్రజలు ఐక్యంగా పోరాటం చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించాలన్నని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి రంగప్ప యాదవ్, ఉమ్మడి జి ల్లా ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్, జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, రవికుమార్, లక్ష్మణ్, ము ష్టి రాజు, గోవింద్, నరసింగప్ప, నారాయణ, యా దయ్య, నరసింహులు, రాజుగారు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment