
బాలికల అభ్యున్నతికి కృషి
నారాయణపేట: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో ప్రచార రథాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వం, బాలిక విద్యపై విస్తృత ప్రచారం చేయాలని, బేటీ బచావో బేటీ పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో బాలికల సంక్షేమానికి, బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రచారం చేయడానికి సాంస్కృతిక కళాకారులచే నాటికలు, చైతన్య గీతాలతో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ శ్రీలత, డీసీపీఓ తిరుపతయ్య,సఖి సెంటర్ అడ్మిస్ క్రాంతి రేఖ, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సిములు, విజయ్ కుమార్, కవిత, కరిష్మ,అశ్విని, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment