నారాయణపేట రూరల్: కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప తెలిపారు. స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు 16 ఏళ్లలోపు విద్యార్థులు ఆదార్ కార్డు, టెన్త్ మెమో తీసుకొని హాజరు కావాలన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో జిల్లా జట్టు ఎంపిక చేసి ఈనెల 20 నుంచి రాష్ట్రస్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇద్దరు ఎస్‌ఐల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలను శుక్రవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నచింతకుంట ఎస్‌ఐగా ఉన్న శేఖర్‌ను నారాయణపేట వీఆర్‌కు, నారాయణపేట వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ రామ్‌లాల్‌ను సీసీకుంటకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment