బీసీ జనాభాను తక్కువ చేసి చూపారు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో బీసీల 20 లక్షల జనాభాను తక్కువ చేసి చూపారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ధర్మాపురంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు జనాభాను తక్కువ చేసి చూపించి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. మరో సారి చేపడుతున్న రీ సర్వేలో తప్పులు సరిదిద్దుకొని న్యాయం చేయకపోతే బీసీల ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని హెచ్చరించారు. పాలమూరు వీరు డు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామ ని అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందెశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న వీరగాధను పొందుపరిచామని అన్నారు. ప్రతిరోజూ ప్రతి పాఠశాలలో ఆయనను స్మరించుకుంటున్నామన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పండుగ సాయన్న ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ముదిరాజ్‌లు నేటికీ అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెక్కెం జనార్దన్ రచించిన పండుగ సాయన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఎన్‌పీ వెంకటేష్, బెక్కెం జనార్దన్, పెద్ద విజయ్‌కుమార్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్, పండుగ సాయన్న సామాజిక సేవాసంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణముదిరాజ్, మైత్రి యాదయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
Comments
Please login to add a commentAdd a comment