న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య
నారాయణపేట రూరల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక కోర్టులో విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈమేరకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పటిష్టమైన చట్టం లేకపోవడంతో ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డాడడని వివరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయవాదులు, జడ్జీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, చెన్నారెడ్డి, న్యాయవాదులు సీతారామరావు, లక్ష్మీపతి, బాలప్ప పాల్గొన్నారు.
పెసర క్వింటాల్ రూ.6,550
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పెసర క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.6,506 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.6,033, వేరుశనగ గరిష్టంగా రూ.6,550, కనిష్టంగా రూ.4,569, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,759, కనిష్టంగా రూ.4,602, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,909, కనిష్టంగా రూ.5,555 ధర పలికాయి.
విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకే ఫోరం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫోరం చైర్‌పర్సన్, టెక్నిక్ మెంబర్ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్‌లో విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తక్షణ పరిష్కారం చూపినట్లు తెలిపారు. 50 ఫిర్యాదులను స్వీకరించినట్లు పేర్కొన్నారు. వచ్చే వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యుత్‌శాఖ అఽధికారులపై ఉందన్నారు. వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఈ రమేష్, సీజీఎం రామాంజనాయక్, వెంకట్, లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment