ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం
నారాయణపేట రూరల్: ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు క్రీడల్లో పాల్గొనాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పొందవచ్చని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో సైతం ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు సాధించుకోవచ్చని తెలిపారు. అనంతరం రన్నింగ్, త్రో, జంప్ తదితర క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్పాటు చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే క్రీడా పోటీలకు నారాయణపేట జిల్లా తరఫున వీరు పాల్గొననున్నారు. కార్యక్రమంలో రాకేష్, అక్తర్ పాషా, గణేష్, నరసింహులు, నరేష్, మహేష్, లత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment