వేతనాలు అందించాలి
నెల నెలా వేతనాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. పాత బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటునెల నెలకు వేతనాలు చెల్లిస్తే బాగుంటుంది.
– నరేందర్, ఎంఎన్‌ఓ
ఆర్నెళ్లుగా ఆర్థిక ఇబ్బందులు
నాకు నెలకు రూ.22,750 వేతనం అందాల్సి ఉంది. ముందు ప్రభుత్వ జిల్లా దవాఖానా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండేది. ఆ శాఖ ద్వారానే రెండు నెలలకు ఒకసారి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ విడుదలయ్యేది. మెడికల్ కళాశాల ప్రారంభం తర్వాత మమ్మల్ని ఆ శాఖలో విలీనం చేశామని చెబుతున్నారు. తమకు వేతనాలు రావడం లేదు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాం.
– మనోహర్, రేడియోగ్రాఫర్
డీఏంఈకి సరెండర్ చేశాం
ఐసీయూ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 20 మంది సిబ్బంది వివరాలను డీఎంఈకి సరేండర్ చేశాం. వారికి సంబంధించి వేతనాలను కోరుతూ ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం బడ్జెట్ రీలీజ్ చేయగానే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
– మల్లికార్జున్, సూపరింటెండెంట్,
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
●
వేతనాలు అందించాలి
Comments
Please login to add a commentAdd a comment