
ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం
నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. 2018 ఎన్నికల ప్రచారంలో తనను ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే జిల్లా ఇస్తానని నాటి సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. వారి ఆకాంక్ష మేరకు కేసీఆర్ జన్మదినం నాడు జిల్లాను ప్రారంభించుకున్నాం. ప్రతి ఎకరాకు నీరందించి సాగును పండుగ చేశాం. కేసీఆర్ పేరు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఎస్.రాజేందర్‌రెడ్డి,
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, నారాయణపేట
అభివృద్ధిలో ముందడుగు
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా అన్ని రంగాల్లో పరుగులు తీస్తోంది. మా తాతయ్య దివంతగ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కల అయిన జాయమ్మ చెరువుకు సాగునీరు తేవడం, పేట– కొడంగల్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించడం మా తొలి విజయం. విద్య, వైద్య రంగాల్లో జిల్లా మరింత ముందడుగు వేస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – చిట్టెం పర్ణికారెడ్డి,
ఎమ్మెల్యే, నారాయణపేట
●

ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం
Comments
Please login to add a commentAdd a comment