వీడని మిస్టరీ
● ఏళ్లు గడుస్తున్నా హత్య కేసుల్లో దోషులను గుర్తించని పోలీసులు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లోనే పలు మర్డర్ కేసులు
● రాజకీయంగా సంచలనం సృష్టించినవి సైతం అదే తీరు
● రెండు, మూడు రోజుల్లో దొరక్కుంటే అంతే సంగతులు..
● ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఛేదించడంలో విఫలం
సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి నేర పరిశోధన, కేసుల ఛేదింపుల్లో పోలీసులకు ఆయుధంగా మారుతోంది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు, ఫోరెన్సిక్ ఆధారాల సాయంతో హత్య కేసులను ఛేదించడం సులభతరం అవుతోంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని హత్యకేసుల్లో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. మరికొన్ని కేసుల విచారణ ఏళ్లతరబడిగా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో రెండు, మూడు రోజుల్లో నిందితులు పట్టుబడకపోతే ఆ కేసు పెండింగ్‌లో పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసుల్లోనూ నిందితులను గుర్తించలేకపోవడం పోలీసుల పనితీరుకు మచ్చగా నిలుస్తోంది.
నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ
గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33 హత్యలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో ఎక్కువగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 30 హత్యలు జరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 14, జోగుళాంబ గద్వాలలో 9, నారాయణపేట జిల్లాలో 8 హత్య కేసులు నమోదయ్యాయి.
విచారణ కొనసాగుతోంది..
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో వ్యక్తి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా నిందితులను గుర్తించలేదు. ఈ కేసు మినహా ఎక్కడా మర్డర్ కేసులు పెండింగ్‌లో లేవు. ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేస్తున్నాం.
– వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment