స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
మద్దూరు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని.. ఇందుకోసం ప్రతి కార్యకర్తల బూత్ స్థాయి నుంచి కృషి చేయాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మద్దూరు, కొత్తపల్లి, కోస్గి మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శంకర్, వెంకటయ్య, విజ యభాస్కర్‌రెడ్డి, రాజు, సాయిలు, భరత్, రవికుమార్, కాశీ, నరేష తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
నారాయణపేట రూరల్: నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. దామరగిద్ద గ్రామానికి చెందిన కనకప్ప ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన టీ–45 పరుగుపందెం 100 మీటర్లు, 200 మీటర్ల పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అదేవిధంగా మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామానికి చెందిన లింగప్ప టీ –44 పరుగుపందెం 400 మీటర్లు, 1500 మీటర్ల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జిల్లా నుంచి ఇరువురు క్రీడాకారులు సోమవారం నుంచి చైన్నెలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. వీరికి మక్తల్ మాజీ ఎంపీటీసీ బాలకిష్టారెడ్డి రూ.10వేలు ఆర్థికసాయం అందించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ రమణ తెలిపారు.
పోటెత్తిన వేరుశనగ
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వేరుశనగ పోటెత్తింది. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఆదివారం మార్కెట్‌కు ఒక్కసారిగా 10,071 బస్తాల వేరుశనగ తీసుకువచ్చారు. అయితే క్వింటాల్ గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.4,884 ధర వచ్చిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు కలిగితే వెంటనే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేయాలని చైర్మన్ లింగం రైతులకు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
Comments
Please login to add a commentAdd a comment