ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
మక్తల్: ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతకు మార్గమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేదపండితుడు తిప్పయ్యస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని మళ్లికార్జున ఆలయం వద్ద శివస్వాముల 25వ మహాపడిపూజ కార్యక్రమం గురుస్వామి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శివమాలధారులు, భక్తులు పురవీధుల గుండా కలశంతో ఊరేగింపు నిర్వహించారు. పడమటి ఆంజనేయస్వామి ఆలయం, మల్లికార్జునస్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకొని మహాపడిపూజ కార్యక్రమం తిప్పయ్య గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివమాలాధారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, భజనలతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌చైర్మన్ నర్సింహగౌడ్, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మాజీ సర్పంచు గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి గురుస్వాములు, మాలాధారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment