మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే అటవీ ప్రాంతంలో ప్రయాణించే క్రమంలో ఎలాంటి శబ్దం చేయరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment