శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
ఊట్కూర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని ఎంపీ డీ.కే అరుణ అన్నారు. మండలంలోని చిన్నపోర్లలో సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమెతోపాటు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆదిత్య పరాశ్రీ, సిద్దలింగేశ్వర స్వామి, శాంతనంద్ పురోహిత్, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర నాయకులు శ్యాంకుమార్, సామాజిక సమసరత ప్రముఖ్ అప్పల ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం డీ.కే. అరుణ మాట్లాడుతూ శివాజీ స్ఫూర్తి తో గ్రామ గ్రామాన యువత ఏకమై దేశ, ధర్మ రక్షణ కోసం కృషిచేయాలన్నారు. పిల్లల భవష్యత్తు కోసం సమాజంలో భారతీయ సనాతన ధర్మం పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కుర్మన్న, కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి, భాస్కర్, రవీంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పది’ ఇంటర్నల్ మార్కుల పరిశీలన ప్రారంభం
నారాయణపేట రూరల్: విద్యాశాఖ ఏర్పాటు చేసిన సీసీఈ విధానంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే కృత్యాలకు సంబందించి సబ్జెక్ట్ టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కుల పరిశీలన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఆ పాఠశాలలో నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షలు, ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబందించి కేటాయించిన 120 మార్కులను సరిచూశారు. జిల్లా వ్యాప్తంగా 126 ఉన్నత పాఠశాలలకు గాను మండలాల వారీగా 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో జీహెచ్‌ఎం నేతృత్వంలో ఒక లాంగ్వేజ్ టీచర్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్లు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు ఒక్కో టీమ్ ఆరు పాఠశాలను పరిశీలించే విధంగా షెడ్యుల్డ్ అందించారు. మొదటిరోజు 45 పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. మార్కుల పరిశీలన చేసి ఆన్‌లైన్ అప్‌లోడ్ చేసి, డీఈఓ కార్యాలయంలో నివే దిక అందిస్తారు. అదేవిధంగా ఈ నెలలో జరిగే ఫ్రిఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులకు సూచనలు చేయనున్నారు.
అలరించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం మూడోరోజు శారద కళా పరిషత్ (మహబూబ్‌నగర్) ఆధ్వర్యంలో మయసభ దుర్యోధన, మైత్రి కళా సమితి (నంచర్ల), శివాంజనేయ నాట్య కళా మండలి (చిన్నరాజమూర్) సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలోని శ్రీకృష్ణ, కుచేల ఘట్టం, జ్ఞానమృత కళామండలి (కోయిలకొండ) ఆధ్వర్యంలో గయోపాఖ్యాన యుద్ధ ఘట్టం, గరుత్మంత నారద సంవాదం నాటకాలను ప్రదర్శించారు. కళాకారులు తమ అభినయంతో అలరించారు. గాయకులు చెన్నకేశవులు భక్తిపాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ పదేళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చివరి రోజు పద్యనాటక ప్రదర్శనల్లో భాగంగా రాజరాజేశ్వరి భజన మండలి (మహబూబ్‌నగర్), శ్రీరామాంజనేయ భజన మండలి (బొక్కలోనిపల్లి) ఆధ్వర్యంలో భజనలు నిర్వహిస్తారని, పుట్టోజు చంద్రమౌళి బృందంచే అన్నమయ్య సంకీర్తనాలహరి, ఇతర భక్తిపాటల కార్యక్ర మం ఉంటుంది. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రవణ్‌కుమార్, సూ పరింటెండెంట్ నిత్యానందాచారి, జిల్లా కళాకారుల సంస్థ కోశాధికారి ఎండీ సలీం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఉపాధ్యక్షుడు నర్సింహులు, కళాకారులు కాశన్న పాల్గొన్నారు.
శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
Comments
Please login to add a commentAdd a comment