
ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు
దామరగిద్ద: ఛత్రపతి శివాజీ మహరాజ్ అందరికి ఆదర్శనీయుడని, గొప్ప వ్యక్తులను స్మరించుకునేలా విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో సంతోషయనీమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, స్వామి ఆదిత్య పరాశ్రీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, బీష్మ పౌండేషన్ చైర్మర్ రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని కాన్‌కుర్తిలో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅథితులుగా హాజరై మాట్లాడారు. మొగల్ సామ్రాజ్య నిరంకుశ పాలనను ఎదిరించి దేశంలో హిందు సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆదర్శనీయుడిని భావి తరాలు గుర్తించేలా విగ్రహావిష్కరణ చేసిన భజరంగ్‌దళ్ యువతను అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక మాజీ ఎంపీటీసీ బస్వరాజ్, భీంరెడ్డి, స్థానిక యువకులు పాల్గొన్నారు.
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు పదికి పైగా బహుళజాతి కంపెనీలు మేళాలో పాల్గొనగా దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. మేళాకు విచ్చేసిన అభ్యర్థుల ధ్రుపత్రాలను పరీశీలించా రు. అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్
నారాయణపేట రూరల్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా కే.సత్యయాదవ్ ఎంపికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి అధ్యక్ష పదవి ఎంపికకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా, ఎన్నికల అధికారిగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కట్ట సుధాకర్ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాలో 9మంది నాయకులు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా రు. అయితే అధిష్టానం పట్టణానికి చెందిన కొండ సత్యయాదవ్ వైపు సానుకూలంగా వ్యవహరించడంతో ఆ పార్టీ రాష్ట్ర సహ ఎన్నికల అధికారి కే.గీతామూర్తి ఆయన పేరును ధ్రువీకరిస్తూ నియామక పత్రాన్ని విడుదల చే సింది. ఈ మేరకు సత్యయాదవ్ నియామకంపై ఆ పార్టీ మండల అధ్యక్షులు జ్యోతి, సాయిబన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
జొన్నలు క్వింటాల్ రూ.2,421
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జొన్నలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.2,421 ధర పలకగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,630, కనిష్టంగా రూ.5,225 ధరలు కోడ్ చేయగా 331 క్వింటాళ్లు చేశారు. తెల్లకందులు గరిష్టంగా రూ.7,740, కనిష్టంగా రూ.6,869 (104 క్వింటాళ్లు), వేరుశనగ గరిష్టంగా రూ.6,550, కనిష్టంగా రూ.4,140 ధర పలకగా 187 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
నేడు పీయూలో హ్యాండ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు

ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు
Comments
Please login to add a commentAdd a comment