
జైపూర్: కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని శిఖర్ జిల్లాలోని కీర్వా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏప్రిల్ 21 న అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పట్టించుకోకుండా,కరోనాతో మృతి చెందిన ఆ వ్యక్తి అంతిమయాత్రకు సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. అంతేకాకుండా మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలోంచి తీసి, ఖననం చేసే సమయంలో చాలా మంది మృతదేహాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు.
హజరైన వారిలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో కోవిడ్ ప్రోటోకాల్స్‌ను లెక్కచేయకపోవడంతో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. 21 మందిలో ఇప్పటి వరకు 5గురు కోవిడ్‌తో మరణించినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ 21 మందిలో ఎక్కువగా వృద్ధులు చనిపోయారు. దీంతో అధికారులు అప్రమత్తమై అంత్యక్రియలకు హజరైనా 147 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.
చదవండి: కళ్లు తెరవండి..లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ‍్చరిక
Comments
Please login to add a commentAdd a comment