కారులో 8 అడుగుల పైథాన్‌ | 8 foot Long Python Rescued in Haryana | Sakshi
Sakshi News home page

కారులో 8 అడుగుల పైథాన్‌

Published Wed, Oct 7 2020 3:26 PM | Last Updated on Wed, Oct 7 2020 5:07 PM

8 foot Long Python Rescued in Haryana - Sakshi

ఛండీఘర్‌: హర్యానాలోని హిస్సార్‌లో ఆటో మార్కెట్‌లో నిలిపి ఉన్న కారు నుంచి 8 అడుగుల పొడవైన పైథాన్‌ను అటవీ శాఖ అధికారులు బుధవారం రక్షించారు. తన కారు వెనుక భాగంలో భారీ పాము కనిపించిందని హిస్సార్ ఆటో మార్కెట్‌లోని ఓ వ్యక్తి తమకు సమాచారం ఇచ్చారని అటవీ శాఖ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర్ దాస్ తెలిపారు. పైథాన్‌ను పట్టుకున్న అనంతరం అధికారులు దాన్ని జింకల పార్కులో వదిలేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి మాట్లాడుతూ, ‘పైథాన్‌ గురించి సమాచారం అందుకున్న తరువాత, మా బృందం అక్కడికి చేరుకుని దాన్ని రక్షించింది. దీనిని జింకల పార్కులో వదిలిపెట్టాం.  25-30 కిలోల బరువున్న పైథాన్ 8 అడుగుల పొడవుతో ఆరోగ్యంగా ఉంది ’అని తెలిపారు.  చదవండి: ఊహించని ట్విస్ట్‌తో‌ మైండ్‌బ్లాక్‌ ఖాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement