మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్‌ | Alisporivir: JNU researchers find new way to tackle malaria | Sakshi
Sakshi News home page

మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్‌

Published Sun, Nov 20 2022 4:51 AM | Last Updated on Sun, Nov 20 2022 4:51 AM

Alisporivir: JNU researchers find new way to tackle malaria - Sakshi

న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్‌ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్‌ ఫర్‌ మాలిక్యులార్‌ మెడిసిన్‌’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్‌–రెసిస్టెంట్‌ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్‌ సి డ్రగ్‌ ‘అలిస్పోరివిర్‌’ను కనిపెట్టారు.

అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్‌–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్‌–రెసిస్టెంట్, అర్టిమెసినిన్‌–రెసిస్టెంట్‌ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్‌ ఆనంద్‌ రంగనాథన్‌ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్‌ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్‌ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్‌ శైలజా సింగ్‌ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్‌’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్‌ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement