mosquito bite
-
మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్
న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అర్టిమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి! -
కామ్‌గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్, ఏడిస్, అనాఫిలిస్తో జరపైలం!
నేరడిగొండ (ఆదిలాబాద్): వర్షాకాలం కావడంతో దోమల సీజన్ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల వ్యాప్తితో ప్రమాదం.. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. క్యూలెక్స్తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్ దోమతో ఈవైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ఏడిస్ దోమతో.. 1 ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. దోమ కాటుకు గురైతే.. అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. -
యంగ్ పైలట్ మృతి.. చిన్న దోమ ఎంత పనిచేసింది!
చిన్న దోమనే కదా అని లైట్ తీసుకున్నారో అంతే సంగతి. దోమ కారణంగా ఓ పైలట్ మృతి చెందింది. అదేంటి దోమతో ఎలా చనిపోయింది అనుకుంటున్నారా..?. ఈ విషాద ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అయితే, ఏడాది క్రితం సదరు పైలట్ మృతిచెందగా నివేదిక తాజాగా బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ట్రెయినీ పైలట్ ఓరియానా పెప్పర్ దోమ కాటు కారణంగా కంటిపై చిన్న వాపు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెకు వైద్యులు యాంటీబయోటిక్స్ టీకాలు ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. రెండు రోజుల తర్వాత ఆమె.. ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో ఆందోళనలకు గురైన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. అనంతరం మృతిచెందింది. కాగా, ఆమె మృతి మిస్టరీ కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా నివేదికను వెల్లడించారు. దోమకాటు కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరిన కారణంగా ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు.. చిన్న వయస్సులో ఆమె ఇలా దోమకాటుతో చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇలా కొద్ది మందికే జరుగుతుందని అన్నారు. British pilot trainee dies after mosquito bite leads to infection in brain: reports https://t.co/TuuK5TNDxO pic.twitter.com/oVqhwx9cvA — New York Post (@nypost) July 6, 2022 ఇది కూడా చదవండి: జఫ్పా కేక్.. రికార్డులు బ్రేక్.. పేరు డిఫరెంట్‌గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్ -
దోమ కుడితే కంటిచూపు పోయింది!
లండన్: దోమలు కుడితే మలేరియా, డెంగీ లాంటి వ్యాధులొస్తాయని మాత్రమే ఇన్నాళ్లూ తెలుసు. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో ఓ మహిళకు మాత్రం దోమ కుట్టడం వల్ల కంటిచూపే పోయింది. వైద్య చరిత్రలో ఈ అరుదైన ఘటనపై వైద్యుడు అభిజిత్ మోహిత్ వెల్లడించిన వివరాల ప్రకారం బ్రిటన్‌కు చెందిన ఓ 69 ఏళ్ల మహిళ గత ఏడాది జూలైలో గ్రెనెడాలోని కరీబియన్ దీవులను సందర్శించింది. ఈ పర్యటన సందర్భంగా ఆమెను అక్కడి దోమలు కుట్టాయి. అనంతరం ఆమెకు ఫ్లూ, జ్వరం, ఒంటిపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు చుట్టుముట్టాయి. మూడు వారాల అనంతరం ఆగష్టులో బ్రిటన్ వెళ్లిపోయినప్పటికీ ఈ సమస్యలు ఆమెను వెంటాడాయి. అక్కడ ఆమె వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీనరీ అండ్ క్వీన్స్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షల్లో ఆమెకు చికన్‌గున్యా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఆమెలో కుడి కంటి చూపు కూడా మందగించింది. కుడి కంటిలోని కింది వైపు సగం చూపును పూర్తిగా కోల్పోయింది. దోమకాటు ద్వారా శరీరంలోకి చొరబడిన వైరస్ ఆమె కుడి కన్ను పని చేసేందుకు సహకరించే నాడీ వ్యవస్థపై దాడి చేసి, ధ్వంసం చేసిందని వైద్యులు కనుగొన్నారు. కంటి చూపును కలిగించే నాడీ వ్యవస్థ సగం పనిచేయడం లేదని తెలుసుకున్నారు. ఈ సమస్యను బాధితురాలు ముందుగా గుర్తించకపోవడంతో ఆమె కంటి చూపును కోల్పోవాల్సి వచ్చింది. -
దోమకుట్టి కన్ను పోయింది
లండన్: దోమల వల్ల మలేరియా, పైలేరియా వంటి రోగాలతోపాటు మరెన్నో ఇతర వ్యాధులు వస్తాయని మనకు తెలిసిందే. అయితే బ్రిటన్ లో మాత్రం ఓ మహిళకు దోమకాటు వల్ల ఏకంగా కనుచూపు పోయింది. దీంతో ఇది అరుదైన కేసుగా మిగిలింది. అక్కడ భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్ కు చెందిన ఓ 69 ఏళ్ల మహిళ 2014 జూలై నెలలో గ్రెనడాలోని కరేబియా దీవులను సందర్శించింది. ఆ సమయంలో ఆమెకు ఓ దోమ కుట్టడంతో ముందు చికెన్ గున్యా వ్యాధి భారిన పడింది. అలా కొద్ది కాలం తర్వాత చూపుమందగించడంతో బ్రిటన్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్ లోగల పోస్టుగ్రాడ్యుయేట్ డీనరి అండ్ క్వీన్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. అందులో ఆమెను డాక్టర్ అర్బిజిత్ మోహెతే అనే వైద్యుడు పరీక్షించాడు. ఈ పరీక్షల్లో దోమకాటు ద్వారా శరీరంలోకి చొరబడిన వైరస్ ఆమె కుడికన్ను పనిచేసేందుకు సహకరించే వ్యవస్థపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసిందని గుర్తించారు. ముందస్తుగా ఈ సమస్య బాధితురాలు గుర్తించకపోవడంతో చివరి దృష్టిలోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంటి చూపు విషయంలో ఎంత తొందరగా చికిత్స చేసుకుంటే అంతమంచిది లేదంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ అని వైద్యులు సెలవిచ్చారు. -
దోమకాటుకు 10 మంది చిన్నారుల బలి
మల్కాన్‌గిరి: దోమ కాటుకు ఒడిశాలో 10 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనులు అధికంగా నివసించే మల్కాన్‌గిరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఈ మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా ఏడాది నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు. దోమకాటు వల్ల సంభవించిన ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారు. వీరు మల్కాన్‌గిరి జిల్లాలోని కొరకుండ, బలిమెల, కలిమెల బ్లాకులకు చెందివారు. దోమకాటుకు గురైన బాధితుల రక్తనమూనాలను భువనేశ్వర్, పుణే ప్రయోగశాలలకు పంపించినట్టు మల్కాన్‌గిరి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఉదయ్‌నాథ్ మిశ్రా తెలిపారు. దోమ కాటుతో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా రోగం బారిన పడి పిల్లలు మృతి చెందారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రయోగశాలల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. మరోవైపు నాలుగు వైద్యబృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటించాయి.