చెన్నై: ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి.. జీవితంలో వారు ఉన్నత స్థానానికి చేరడానికి దోహదపడతాడు. అయితే నేటి తరం గురువుల్లో కొందరు గురవింద గింజలుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాధితులు సదరు టీచర్ అరాచకాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వివాదం పెను దుమారం రేపింది. దీంతో చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్(పీఎస్‌బీబీ) స్కూల్ యాజమాన్యం సోమవారం ఆ కీచక టీచర్‌ని సస్పెండ్ చేశారు. కాగా అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్‌సీపీసీఆర్) చర్యలు ప్రారంభించింది. దీనిపై చెన్నైలోని సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ...నిందితుడిపై ఎవరైనా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. కాగా నిందితుడు లైంగికంగా వేధించినట్టు సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా దర్యాప్తు తర్వాత నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పోయమోళి తెలిపారు.
(చదవండి: చైనాలో గ్యాస్ లీక్: ఏడుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment