న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు. ఈ కేసును మంళళవారం సీజేఐ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారించింది. గతంలో జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో తన పదవికి సంబంధించిన కేసును తానే విచారించాల్సిన పరిస్థితి తలెత్తింది.
దీంతో ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ ధర్మాసనంలో సభ్యునిగా నేను లేని బెంచ్‌కు ఈ కేసును బదిలీచేస్తున్నాను’’ అని సీజేఐ వెల్లడించారు. మీరు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పినా సరే సీజేఐ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన చట్టంలో గత ఏడాది మార్పులు చేస్తూ కేంద్రం తెచి్చన చట్టంలోని సెక్షన్7 చట్టబద్ధతను సవాల్‌చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment