
సాగర్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.
మన దేశ రాజ్యాంగాన్ని మార్చేయడానికి కొందరు వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని పరోక్షంగా బీజేపీ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి జరిగిందని మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు.