
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా వైరస్‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 18 లక్షల 50 వేలు దాటాయి. గడచిన 24 గంటలలో అత్యధికంగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా మొత్తం 803 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 44,306 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలావుండగా దేశంలో ఇప్పటివరకు 18,55,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసుల సంఖ్య 5,86,298గా ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,30,509 గా ఉంది. ఇక కరోనా కారణంగా దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 38,938 కు చేరుకుంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 66.31గా ఉంది. దేశంలో గడచిన 24 గంటలలో 6,61,892 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,08,64,750 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.