
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,136 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరింది. గత మూడు రోజుల నుంచి భారత్‌లో ప్రతి రోజు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,86,598 పాజిటివ్ కేసుల ఉండగా.. 37,80,107 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక మహారాష్ట్రలో గత 24 గంటల్లో గరిష్టంగా 30 వేల కేసులు నమోదు కాగా.. 416 మంది మరణించారు. (చదవండి: కరోనా వూహాన్ ల్యాబ్‌లోనే తయారైంది)
ఇక కరోనా కేసుల్లో ఇప్పటికే భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఆగస్టు నెల మధ్య నుంచి అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక కోవిడ్‌కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు జనాలంతా జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment