సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో44,263 మంది కరోనా బారిన పడగా 547 మంది మరణించారు. నిన్న దేశ వ్యాప్తంగా 49,079 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,28,668గా ఉంది. ప్రస్తుతం 4,84,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 81,15,580 మంది కోలుకున్నారు. దేశంలో 92.97 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 1.47శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల శాతం 5.55గా ఉంది. చదవండి: భారత్‌కు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,55,663కు చేరాయి. గురువారం నాడు నలుగురు మరణించగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1397కు చేరింది. నిన్న 1,222 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,37,173 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17,094 యాక్టివ్ కేసులు ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 169 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఫుడ్ ..సారీ నో ఆర్డర్..
Comments
Please login to add a commentAdd a comment