
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని తుదముట్టించేందుకు ఏడాది కాలంలోగానే ‘కోవిడ్’ వ్యాక్సిన్‌ను కనుగొనడం ఓ అద్భుతమనే చెప్పవచ్చు. ఎన్నో అంటు రోగాలకు దారితీసిన, దారి తీస్తోన్న భయానక బ్యాక్టీరియాను తుదముట్టించేందుకు 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్స్‌ను ‘పెన్స్‌లిన్’ను కనిపెట్టడంతో కోవిడ్ వ్యాక్సిన్లను పోల్చవచ్చు. ఒకప్పుడు వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు కనీసం ఓ దశాబ్ద కాలం పట్టగా, ఈ సారి ఓ ఏడాదిలోనే కోవిడ్ వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అద్భుతమే కాకుండా, ఇది మరెన్నో అంటు రోగాలను నిర్మూలించే వ్యాక్సిన్లను కనుగొనేందుకు దారితీస్తుంది. ఎబోలా లాంటి వైరస్‌లకు కూడా సమర్థమైన వ్యాక్సిన్‌ను కనుగొనవచ్చు.
(చదవండి : వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం)
బ్యాక్టీరియా వల్ల వస్తోన్న అంటురోగాలకు విరుగుడుగా మనం యాంటీ బ్యాక్టీరియా మందులు వాడుతూ వచ్చాం. ఫలితంగా బ్యాక్టీరియాలో కూడా యాంటీ బాడీస్‌లు పెరగుతూ వచ్చాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియా మందులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం వచ్చింది. బ్యాక్టీరియాకు కూడా వ్యాక్సిన్ లాంటి మందులను కనుగొనేందుకు నేటి కోవిడ్ వ్యాక్సిన్లు దోహదం చేయవచ్చు. అర్‌ఎన్‌ఏ అణువుల నుంచి వ్యాక్సిన్ల తయారీకి ఎంతో కాలం నుంచి పరిశోధనలు జరపుతుండగా, తుదకు ఫైజర్ ద్వారా విజయం సాధించడం సాధారణ విషయం కాదు’ అని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్’లో వ్యాక్సినాలోజీ ప్రొఫెసర్ బ్రెండాన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment