వివాహేతర సంబంధం: మెడలో చె‍ప్పులతో | Couple Forced To Strip Garlanded With Shoes Paraded In Jharkhand | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: మెడలో చె‍ప్పులతో

Published Sun, Sep 27 2020 1:16 PM | Last Updated on Sun, Sep 27 2020 9:17 PM

Couple Forced To Strip Garlanded With Shoes Paraded In Jharkhand - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాంచీ: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గ్రామపంచాయతీ పెద్దలు ఆ జంటకు మెడలో బూట్ల దండలు వేసి గ్రామమంతా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు వారిని కాపాడారు.  వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకుంది. అయితే ఈ మధ్య శివ పహాద్‌ ప్రాంతంలోని తన బంధువులతో కలిసి ఉండటానికి వచ్చింది.   (బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) 

ఈ క్రమంలో జుహిబోనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఈ జంటను గ్రామపంచాయతీకి పిలిచారు. వారి కుటుంబ సభ్యులను కూడా సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా.. గ్రామ పంచాయతీ వారికి రూ.5లక్షల జరిమానా విధించింది. పంచాయతీ ఆదేశం మేరకు ఈ జంట బలవంతంగా బూట్ల దండతో గ్రామమంతా తిప్పారు. సంప్రదాయాలను, కట్టుబాట్లను అతిక్రమించకుండా ఉండటం తమ ప్రధాన కర్తవ్యం అని పంచాయతీ పేర్కొంది. వైరల్‌ అయిన ఈ వీడియో పోలీసుల దాకా వెళ్లడంతో వెంటనే అక్కడకు చేరుకొని వారిని రక్షించారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement