భువనేశ్వర్ : దేశాన్ని వణికిస్తున్నా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినా సరే నిత్యం ఎక్కడో ఒక చోట కరోనా వైరస్ తో బాధపడుతున్న బాధితుల హృదయ విదారకర దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరిన బంధువుల పరిస్థితి తెలుసుకొని ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారే తప్పా ఆస్పత్రికి వెళ్లే సాహసం చేయడం లేదు.
తాజాగా ఒడిశా బారిపాడ జిల్లాలో కరోనా ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. బెడ్లు లేక, వైద్యులు ట్రీట్మెంట్ అందించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు లేక ఎక్కడ అంటే అక్కడ కుప్పు కూలిపోతున్నారు. టాయిలెట్లలో అర్ధనగ్నంగా పడుకొని ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మయూర్ భంజ్ జిల్లాలోని పలబని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యుల్ని బారిపాడ జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు. కానీ అక్కడ డాక్టర్లు లేరని, ఆక్సిజన్ సిలిండర్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్ కోసం భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది. ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు చూసిన తర్వాత ఆస్పత్రులపై నమ్మకం పోయింది. ప్రాణాలు పోతే పోనీ. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కంటే ఇంట్లో ఉండి, డాక్టర్ల సలహాతో వైద్యం చేయించుకోవడం మంచిదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, వైరల్ అవుతున్న వీడియోలపై బారిపాడ కలెక్టర్ వినీత్ భరద్వాజ్ స్పందించారు. సదరు ఆస్పత్రి ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చదవండి : కేటీఆర్కు ‘సర్..’ అంటూ సోనూసూద్ రిప్లై
Comments
Please login to add a commentAdd a comment