లిక్కర్‌ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌.. ఫోన్లు మార్చి లావాదేవీలు చేసిన ఎమ్మెల్సీ కవిత! | ED Included MLC Kavita Name In Delhi Liquor Scam Case | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌.. ఫోన్లు మార్చి లావాదేవీలు చేసిన ఎమ్మెల్సీ కవిత!

Published Wed, Nov 30 2022 9:18 PM | Last Updated on Wed, Nov 30 2022 9:27 PM

ED Included MLC Kavita Name In Delhi Liquor Scam Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. రాష్ట్ర పాలిటిక్స్‌లో లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపలు కలకలం రేపుతున్నాయి. లిక్కర్‌ స్కామ్‌లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపించడం టీఆర్‌ఎస్‌ను టెన్షన్‌కు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. 

అయితే, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ.. ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. రిమాండ్‌లో అమిత్‌ ఆరోరా కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిపింది. లిక్కర్‌ పాలసీలో పెంచిన 12 శాతం కమీషన్‌ను ఆప్‌ ప్రభుత్వానికి అప్పచెప్పేందుకు లావాదేవీలు జరిపినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

కాగా, సౌత్‌ గ్రూప్‌పేరుతో సిండికేట్‌గా మారి రూ. 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పారని ఈడీ ఆరోపించింది. పలు ఫోన్లను మార్చి లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఇక, ఆయా వ్యక్తుల ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొన్నది. దీంతో, ఈ కేసులో కీలక ట్విస్ట్‌ చోటుచేసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement